స్టేట్ బ్యాంక్ లో మీకు అకౌంట్ వుందా..? ఎస్బీఐ డెబిట్ కార్డుని మీరు వాడుతున్నారా..? అయితే మీకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ వస్తుంది. అయితే ఇన్స్యూరెన్స్ ఎంత ఉంటుందన్నది డెబిట్ కార్డు టైప్ పైన ఆధారపడి ఉంటుంది. మరి వాటి కోసం ఇప్పుడే పూర్తి వివరాలని చూద్దాం. డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. పైగా ఆ కార్డును ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో గత 90 రోజుల్లో వాడాలన్న నిబంధన కూడా వుంది.
ఇది ఇలా ఉంటే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) నాన్ ఎయిర్ అనేవి రెండు రకాల ఇన్స్యూరెన్స్‌లు. అయితే ఏ కార్డు పైన ఎంత ఇన్స్యూరెన్స్ ఉంటుందో చూద్దాం. SBI Gold (MasterCard/VISA) కార్డు అయితే ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000.
అదే SBI Platinum (MasterCard/VISA) అయితే యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.10,00,000. ఇది ఇలా ఉంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.2,00,000. అలానే : పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.4,00,000 ని SBI Pride (Business Debit) MasterCard/VISA వారు పొందొచ్చు.
SBI Premium (Business Debit) MasterCard/VISA పై పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.5,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.10,00,000. అలానే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కవర్ నాన్ ఎయిర్ (డెత్) రూ.10,00,000. పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (డెత్) రూ.20,00,000 ని SBI VISA Signature/MasterCard Debit Card కలిగిన వాళ్ళు పొందొచ్చు. అదే విధంగా SBI RuPay Platinum Debit Card ఉన్నవారికి యాక్సిడెంటల్ డెత్ లేదా టోటల్ డిసేబిలిటీ రూ.2,00,000 కవరేజీ లభిస్తుంది.