మంచం పై పవన్..కచ్చడం పై రానా..భీమ్లా నాయక్ నుండి అదిరిపోయే స్టిల్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాణా కాంబినేషన్ లో భీమ్లా నాయక్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో పాటు మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు …పోస్టర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుండి ఓ ఫోటో విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ లుంగీలో మంచం పై పడుకుని ఉండగా…వెనకాలే రానా కచ్చడం పై వైట్ లుంగీ షర్ట్ వేసకుని కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news