పసుపు టీ వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా….!

-

సాధారణంగా మనం వంటల్లో విరివిగా పసుపును వాడుతూ ఉంటాము. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని మనకి తెలుసు. ఔషధ గుణాలు ఉన్న పసుపు ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొడుతుంది. అలానే పసుపు టీ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి పసుపు టీ ని ఎలా తయారు చేయాలి…?, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి….? అనే వాటిని ఇప్పుడే చూద్దాం.

పసుపు టీ కి కావాల్సిన పదార్థాలు:

పసుపు కొమ్ము లేదా పసుపు పొడి, తేనె, చిటికెడు మిరియాల పొడి.

తయారు చేసుకునే విధానం :

ముందుగా రెండు కప్పుల నీళ్లను గిన్నెలో పోసి స్టవ్ మీద వేడి చేయండి. ఆ తర్వాత పసుపు కొమ్ముని లేదా పసుపుని ఆ నీళ్లలో వేయండి. కాసేపు మూత పెట్టి మరిగించండి. ఇప్పుడు వీటిని ఒక గ్లాసులో పోసి ఒక టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి వేసి కలపండి. ఇక పసుపు టీ రెడీ అయిపోయింది. దీనిని ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు తాగండి.

పసుపు టీ వల్ల కలిగే ప్రయోజనాలు:

క్యాన్సర్ నుండి రక్షిస్తుంది, మతిమరుపు రాకుండా ఉంటుంది. అంతే కాకుండా కీళ్ళ సంబంధిత వ్యాధుల నివారణకు పసుపు చక్కటి పరిష్కారం చూపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది మంచి పరిష్కారం ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది మంచి పద్ధతి. పసుపు టీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చూసారా ఎన్ని ప్రయోజనలో…? మరి ఇలా తయారు చేసేసుకోండి. అనేక సమస్యలకి చెక్ పెట్టేయండి.

Read more RELATED
Recommended to you

Latest news