బంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీ బర్తరఫ్​

-

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కేబినెట్ లో ఓ మంత్రిని బర్తరఫ్ చేశారు. ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో అరెస్టైన మంత్రి పార్థా ఛటర్జీపై వేటు వేశారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిగా ఉన్న ఆయణ్ను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈ ప్రకటనకు ముందు బంగాల్ కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ మీటింగ్‌లో పార్థ ఛటర్జీ గురించి ఎలాంటి చర్చ రాలేదని అంతకు ముందు సమాచారం వచ్చింది. కానీ…ఈ భేటీ ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అంతకు ముందు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించటమే మంచిది” అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు. తరవాత ఆ ట్వీట్‌ తొలగించారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ నిర్ణయం ప్రకటించక ముందు స్పష్టం చేశారు. అయితే మంత్రి పార్థా ఛటర్జీ తప్పు చేశారని కోర్టు తేల్చి చెబితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని గతంలోనే అధిష్ఠానం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news