జొన్నలో వచ్చే తెగుళ్ళు,వాటి నివారణ చర్యలు..

-

మన దేశంలో పండిస్తున్న పంటలలో ఒకటి జొన్న..ఈ పంట సాగులో కొన్ని మెలుకువలు తప్పనిసరిగా పాటించాలి.. లేకుంటే తెగుళ్ళు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.జొన్నలో తరచు వచ్చే తెగుళ్లు వాటి నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పక్షి కన్ను తెగులు

కోలిటోట్రికమ్ గ్రామీమినికోలా అను శిలిద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఆకులపై చిన్న చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి
ఈ శిలీంద్రం కాండము మరియు కంకి భాగం ల్లో వ్యాపించి వాటిని కుళ్ళినట్లుగా చేస్తోంది.
ఈ దశలో కంకి భాగంని నిలువు కోసినప్పుడు లోపల కంజాలం ఎరుపు రంగు లోకి మారి ఉంటుంది.

నివారణ

థైరాన్ లేదా కెప్టెన్ తో విత్తనశుద్ధి చెయ్యాలి.
గట్లపై ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కలను తీసివేయాలి.
తెగులు గమనించిన వెంటనే మాకోజీబ్ 0.25ను 2సార్లు పిచికారీ చెయ్యాలి.
తెగులు తట్టుకొనే రాకలను ఎన్నుకోవాలి.

కాటుక తెగులు

స్పైసిలోడిక సోర్గ్ అను శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
ఈ తెగులు పైరు విత్తిన తర్వాత ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నపుడు ఆశిస్తుంది.
తెగులు సోకిన మొక్కలు గడసబారి వెన్ను తీసిన తరువాత తెగులు లక్షణాలు గుర్తించవచ్చు.
ఈ గింజలు పగిలి నల్లని శిలింద్ర బీజాలను బయటకి వెదజల్లుతాయి.

నివారణ

పంట మార్పిడి చెయ్యాలి.
ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి.
కెప్టెన్ తో 4 గ్రా. 1కిలో విత్తనానికి కలిపి శుద్ది చేయాలి.
తెగులు సోకిన కంకులను పీకి వాటిని పూర్తిగా కాల్చి వెయ్యాలి.

ఎర్గాట్ తెగుళ్లు

ఈ తెగుళ్లు కూడా శీలింద్రం ద్వారా వ్యాపిస్తుంది.తెల్లని లేక లేత ఎరుపు రంగు జిగట లాంటి తియ్యటి ద్రవం చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది.
దీనిలో శిలింద్ర బీజాలు ఉంటాయి.
దీని తరువాత వ్యాధి సోకిన గింజల్లో నల్లటి స్క్లారోటియ్లులు ఏర్పడును. దీనిని ఎర్గట్ దశ అంటారు

నివారణ

తెగులు సోకిన పొలంలో నుండి విత్తనాలు సేకరిచాలి.
విత్తనాలు 10% ఉప్పు ద్రావణం ల్లో ముంచి తేలిన స్క్రోషియాలను వేరు చేయాలి
వేసవి ల్లో లోతు దుక్కి చెయ్యాలి.
పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను తీసివేయాలి.
పైరు పూత దశలో మాకోజీబ్ 2.5వృధా లేదా క్యాబేందిజ్మ్ 1గ్ర లీటర్ ను వారం వ్యవది ల్లో రెండు సార్లు పిచికారీ చెయ్యాలి.

ఆకు మాడు తెగులు కూడా ఉంటుంది.. అది కూడా జొన్నకు ప్రమాదమే..అందుకే తెగుళ్లు నివారణలో సరైన చర్యలు తీసుకోవాలి లేకుంటే మాత్రం పంట దిగుబడి మీద ఎఫెక్ట్ పడుతోంది..ఇంకేదైనా సందెహాలు ఉంటే దగ్గరి లోని వ్యవసాయ నిపునులను సంప్రదించాలి..

Read more RELATED
Recommended to you

Latest news