చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటుడు మృతి!

-

చలన చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.

అయితే తాజాగా ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ చటర్జీ నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అభిషేక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆయన మరణానికి గల అసలు కారణం మాత్రం వారు వెల్లడించి లేకపోయారు.

ఇక అభిషేకం మృతిపట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ చటర్జీ హఠాన్మరణం చెందారు అనే వార్తను కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ ఎంతో టాలెంటెడ్ నటుడు అని ఆమె కొనియాడారు. విలక్షణమైన నటనతో అందరిని అలరించాలని ఆమె చెప్పుకొచ్చారు. కాగా అభిషేక్ ఇప్పటివరకు 100 సినిమాలకు పైగా నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news