చెమటకాయలకు ఇలా చెక్ పెట్టేయండి..! రాకుండా ఈ జాగ్రత్తలు..

-

వేసవిలో చెమటకాయలు రావడం చాలా కామన్. అయితే కొందరికి ఇవి విపరీతంగా వస్తాయి. ఎన్ని పౌడర్స్ రాసినా అవి ఒక పట్టాన పోవు. మెడమీద. చెతులకు, వీపు, పొట్టమీద, ముఖం మీద ఒక పెద్ద సమూహంలానే ఈ చెమటకాయలు వస్తాయి. అసలే ఎండ మంట అంటే.. ఈ చెమటకాయల వల్ల మళ్లీ దురద.. బట్టలు ఉంచోకోవాలనిపించదు.. పాపం ఇలాంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మరీ ఈ సమస్యకు హో రెమిడీస్ తో చెక్ పెట్టేద్దామా..!

ఐస్ క్యూబ్స్ తో

సాధారణంగా శరీరం నుంచి స్వేద గ్రంథుల ద్వారా చెమట బయటికి వస్తుంది. కానీ ఎక్కడైనా ఈ గ్రంథులు మూసుకుపోతే చెమట బయటికి రాలేక శరీరంపై ఎర్రగా ఉండే చిన్న చిన్న దద్దుర్లు ఏర్పడతాయి. ఇంట్లో ఉండే పదార్థాలతో చెమటకాయల్ని వదిలించుకోవచ్చు. చల్లటి ఐస్‌ముక్కలు శరీరానికి ఉపశమనాన్నిస్తాయి. చిన్నచిన్న ఐస్‌ముక్కల్ని ఎర్రగా ఉన్న చెమటకాయలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల మంట తగ్గిపోయి తద్వారా చెమటకాయలూ కూడా తగ్గుతాయి.

వేపాకు

కొన్ని వేపాకుల్ని తీసుకుని నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ని చెమటకాయలున్న చోట పూసి.. పూర్తిగా ఆరనివ్వండి.. వేపలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంపై ఉండే క్రిములు నాశనమై తక్షణ ఉపశమనం లభించడంతో పాటు ఏవైనా ఇతర చర్మవ్యాధులున్నా కూడా పోతాయి.

చందనంతో

చందనం పొడి, కొత్తిమీర పొడి.. ఈ రెండింటినీ ఒక్కోటి రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుని.. మూడు టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్ వేసి మృదువైన పేస్ట్ వచ్చే వరకు బాగా కలపాలి. ఈ పేస్ట్‌ని చెమటకాయలున్న చోట పూయండి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి.

నిమ్మరసంతో..

నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల చెమటకాయలు తగ్గిపోవడమే కాదు.. శరీరానికి కూడా చలువ చేస్తుంది. రోజుకు నాలుగు గ్లాసుల నిమ్మరసం తాగితే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. సమ్మర్ లో లెమన్ వాటర్ తాగడం బాడీ డీహెడ్రేట్ గా ఉంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.

కలబంద గుజ్జుతో..

కలబంద గుజ్జును చెమటకాయలుండే చోట పెట్టి కాసేపు అలా ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటంది.

అసలు ఈ పంచాయితీ లేకుండా ఉండాలంటే..

వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో నీళ్లు బాగా తాగాలి.

బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా.. బాగా వదులుగా ఉండేవి ధరించాలి

పడుకునే గదిలో చల్లగా, బాగా గాలి ఆడేలా వెంటిలేషన్ ఉంచుకోవాలి.

చర్మాన్ని ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. అలాగే స్నానానికి రసాయనాలు ఎక్కువగా ఉండే సబ్బులు ఉపయోగించొద్దు.

కొంతమంది చర్మం పొడిబారిపోతోందని రకరకాల క్రీమ్స్, ఆయిల్స్ ఉపయోగిస్తారు. కానీ అవి చెమటకాయల్ని అరికట్టవు. పైగా చర్మంపై ఉండే స్వేద గ్రంథుల్ని మూసేసి చెమట బయటికి రాకుండా చేస్తాయి. ఇది చర్మానికి మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news