బిగ్‌ బ్రేకింగ్‌ : బెంగళూరులో జూలై 14 నుండి జులై 23 వరకు లాక్‌డౌన్‌..

-

కరోనా మహమ్మారి ధాటికి యావత్‌ ప్రపంచమే కకావికలమైపోతుంది. ప్రతీరోజు 20వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండంతో మూడో స్థానంలో ఉంది మనదేశం. ఇది ఇలాగే కొనసాగితే మొదటి స్థానానికి రావడానికి ఎక్కువ రోజులు సమయం పట్టదు.

karnataka-corona
karnataka-corona

కరోనా కేసుల్లో కర్ణాటకలో కేసులు బాగా పెరగటం, బెంగళూరులో శుక్రవారం ఒక్క రోజే 1447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 29 మంది మరణించారు. కర్ణాటకలో నమోదైన మొత్తం కేసుల్లో బెంగుళూరుదే సగం ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఆ రాష్ట్రంలో 33,418 కేసులు నమోదు అవగా కేవలం బెంగుళూరులో 15,329 కేసులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో జూలై 14 సాయంత్రం నుండి జులై 23 వరకు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. బెంగుళూరు పట్టణం మరియు రూరల్‌ ప్రాంతాల్లో ఏడు రోజుల పాటు లౌక్‌డౌన్‌ విధిస్తున్నామని. జులై 14 సాయంత్రం 8 గంటలనుండి జులై 23 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని, నియమనిబంధనలు సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. అన్నిరకాల నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, పండ్లు, మెడిసిన్‌, కిరాణా సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

కరోనాని ఎదుర్కోవడంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని, అధికారులు సూచించే సూచనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా ఉండి ఈ విపత్తునుండి బయటపడేందుకు కృషి చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news