“పవర్‌ స్టార్‌” విడుదలకు శ్రేయాస్‌ బ్రేక్..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘పవర్‌స్టార్’‌ పేరుతో ప్రకటించిన సినిమాకు సంబంధించి కొన్ని వివాదాస్పద స్టిల్స్‌, పోస్టర్స్‌ను విడుదల చేశారు. అయితే ఈ చిత్రం శ్రేయాస్‌ ఎటీటీలో విడుదల చేయడం లేదని, దీనితో పాటు వివాదాలతో కూడిన ఏ సినిమాను తమ శ్రేయోస్‌ ఏటీటీలో విడుదల చేయమని శ్రేయాస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. తమ ఏటీటీలో విడుదల చేయబోయే చిత్రాలపై తుదినిర్ణయం తమదేనని ఈ సందర్బంగా ఆయన తెలియజేశాడు.

Power star movie poster

దీంతో వర్మకు షాకిచ్చిన ఏటీటీ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. మరి ఈ పరిస్థితుల్లో వర్మ తన ‘పవర్‌స్టార్’ను ఏ రూపంలో విడుదల చేస్తాడో చూడాలి. కాగా, ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తుండగా పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం రాంగోపాల్‌వర్మపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news