మహిళ మీద డెలివరీ బాయ్ దాడి కేసులో మరో ట్విస్ట్..

-

జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనను కొట్టాడని ఆరోపించిన మోడల్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్షర్ హితేషా చంద్రానీపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులో జోమాటో ఉద్యోగి కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హితేషా చంద్రానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. జోమాటో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 355 (దాడి), 504 (అవమానం) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదయ్యాయి. ఇక ఆమె మీద దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జొమాటో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్, తనపై చేసిన ఆరోపణలను తిరస్కరించాడు.

ఇటీవల, హితేషా చంద్రానీ అనే బెంగళూరు మహిళ తనపై జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ దాడి చేశాడని ఆరోపించారు, దీనివల్ల ముక్కులో రక్తస్రావం జరిగిందని ఆమె పీర్కోంది. డెలివరీ ఆలస్యం కావడంతో అడిగినందుకే జోమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనపై దాడి చేశాడని ఆరోపిస్తున్న వీడియో మార్చి 9 న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే “నేను డెలివరీ చేయడం ఆలస్యం కావడంతో ఆర్డర్ తీసుకున్నాక కూడా ఆమె డబ్బు చెల్లించడానికి నిరాకరించింది అని, దానిని ఉచితంగా ఇవ్వాలని కోరిందని కామరాజ్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news