టీహబ్​కు మరో జాతీయ అవార్డు

-

తెలంగాణకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. టీహబ్​కు భారత్‌లో ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2022 జాతీయ స్టార్టప్ అవార్డుల్లో ఇంక్యుబేటర్ విభాగంలో టీహబ్​కు ఈ పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, సోం ప్రకాశ్ దిల్లీలో అవార్డులను ప్రకటించారు. ఇంక్యుబేటర్ విభాగంలో దేశవ్యాప్తంగా 55 సంస్థలు పోటీ పడగా.. టీహబ్​కు అవార్డు దక్కింది.

రాష్ట్రంలో సుమారు రెండున్నర వేల స్టార్టప్‌ల స్థాపనలో టీహబ్ కృషి చేసింది. టీహబ్ స్టార్టప్‌లు సుమారు 1.9 బిలియన్ల యూఎస్ డాలర్లు, దాదాపు 12వేల ఉద్యోగాలను సృష్టించినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్, టీహబ్ సీఈవో ఎంఎస్ఆర్ తెలిపారు. అవార్డు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news