ఓరి నాయనో..ఇదేం పిచ్చి పనిరా బాబు..కుక్కలకు వేడుక..వీడియో వైరల్..

-

చాలా మంది తాము ఇష్టంగా పెంచుకుంటున్న జంతువులకు పుట్టిన రోజు వేడుకలు, పెళ్లిళ్లు, సీమంతం ఇలా ఏదోక వేడుకను చేస్తారు.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తారు.. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఉత్తరప్రదేశ్‌ లోని అలీగఢ్‌ లో వెలుగు చూసింది. సాంప్రదాయబద్ధంగా పెంపుడు కుక్కలకు వివాహం జరిపించాడు ఓ యజమాని. మనుషుల పెళ్లి కోసం అమ్మాయి, అబ్బాయిని వెతికినట్టుగానే.. ఇక్కడ కూడా వేరువేరు ప్రాంతాల కు చెందిన రెండు కుక్కలకు వివాహం నిశ్చయించారు వాటి యజమానులు.

ఆ తర్వాత ఆచార సంప్రాదాయల ప్రకారం వాటికి పెళ్లి చేశారు. ఏడు నెలల ఆడ కుక్క జెల్లీకి టామీకి వేడుకగా పెళ్లి జరిపించాడు. టామీ సుఖ్రావలి గ్రామస్తుడైన దినేష్ చౌదరి పెంపుడు కుక్క. కాగా, జెల్లీ టిక్రీ రాయ్‌పూర్‌కు నివాసి డాక్టర్ రాంప్రకాష్ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క.. అలీఘర్‌లోని సుఖ్రవలీ ప్రాంతానికి చెందిన దినేష్‌ చౌదరికి చెందిన టామీకి.. టిక్రీ రాయ్‌పూర్‌కు చెందిన రాంప్రకాశ్‌ సింగ్‌కు చెందిన శునకం జెల్లీకి జనవరి 14వ తేదీన పెళ్లి వేడుక నిర్వహించారు. బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్ల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి భారీ సంఖ్యలో బంధుమిత్రులు కూడా వచ్చారు.. ఈ వేడుక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. కొంతమంది ఇదేం పిచ్చి అని, ఇంకొంత మంది మాత్రం మంచి ఆలోచన అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news