హైదరాబాద్ : సెప్టెంబర్ 10 న గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని..19 సెప్టెంబర్ న గణేష్ నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ…. జనరల్ సెక్రటరీ భగవంత రావు ప్రకటన చేశారు. గణేష్ విగ్రహాల తయారీకి కావాల్సిన ఏకో ఫ్రెండ్లీ, రా మెటీరియల్ అందించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పిన ఆయన.. గణేష్ ఉత్సవాలకు 21 రకాల ఔషద మొక్కల కొరత ఉందన్నారు..
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ మొక్కలను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చూడాలని.. గణేష్ నిమజ్జనికి వెళ్లే మార్గాలు బల్దియా అధికారులు బాగు చేయాలని కోరారు.. నిమజ్జనం సందర్భంగా ముందే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని.. గణేష్ ఉత్సవాల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.
థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని అన్ని గణేష్ మండపాల నిర్వహకులను కోరుతున్నామని.. గణేష్ విగ్రహాలలో ఎత్తు గురించి పోటీ పడకుండా నిమజ్జనానికి సులువుగా ఉండేలా నిరాడంబరంగా ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశ భక్తి దైవ భక్తి ప్రిరేపించే కార్యక్రమాలు మాత్రమే ఉత్సవాలలో చేయాలని.. పార్టీలకు అతీతంగా ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.