దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో… ఎన్ సిపి పార్టీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ సమావేశం అయ్యారు. దాదాపు వీరిద్దరి మధ్య 50 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ మేరకు…. ప్రధాని కార్యాలయం అధికారి ట్వీట్ చేశారు. దీంతో దేశ రాజకీయాల్లో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ప్రధాని మోడీ మరియు శరద్ పవార్ తో భేటీ కి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
19వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షా కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఆ సమావేశాలు సజావుగా జరగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ మరియు శరద్ పవార్ జరిగినట్లు చెబుతున్నారు. ఇక నిన్ననే కేంద్ర మంత్రులు రాజనాథ్ సింగ్ మరియు గోయల్ కూడా శరత్ పవార్ తో సంప్రదింపులు జరిపారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు పరిశీలన లో ఉందనే ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం పై మరింత ఆసక్తి పెరిగింది.