నిర్మల్ జిల్లా భైంసా లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. దీంతో ముందు జాగ్రత్తతో అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 50 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెడుతున్నారు. కరోన కారణంగా నిడరాంబరంగా ఉత్సవాలు జరుపుకోవాలని, డిజెలు, బ్యాండ్ లతో ఊరేగింపు చేయకూడదని పోలీసుల సూచనలు చేశారు.
గతంలో జరిగిన అల్లర్ల కారణంగా నిమజ్జనం జరిగే రూట్ మ్యాప్ ని గతంలో కాకుండా ఈ సారి రూట్ ను మళ్లించారు అధికారులు. భైంసా గణేష్ నిమజ్జనం చేసే గడ్డేన్న వాగు ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ ముసరఫ్ అలీ ఫారుకీ, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు పరిశీలించారు. అయితే ముందు 144 సెక్షన్ ఉందని పేర్కొన్న అధికారులు 144 సెక్షన్ లేదని ప్రకటన విడుదల చేశారు.