వైసిపి బలహీన వర్గాల పార్టీ అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో నేడు శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ర్ట చరిత్రలో ఎప్పుడూ ఇంతగా బిసిలకు పట్టం కట్టలేదన్నారు. ఇక్కడ వైసిపికి 666 ఉన్న ఓట్లు ఉన్నాయని.. కానీ దానికంటే ఒకటో రెండో ఓట్లు ఎక్కవ పడాలన్నారు. ఓటర్లు అందరూ డివిజన్ కేంధ్రాలకు ఒక్కరోజు ముందే చేరాలని సూచించారు.
టిడిపి పబ్బం గడుపుకొనేందుకు ఏవో చర్యలు చెపడుతుందన్నారు. జగన్ నాయకత్వం ఈ రాష్ర్టానికి శ్రీరామ రక్ష అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు మనకి అవసరం అన్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెయాలనుకుంటున్నారని.. కనుక ఈ ఎన్నికలలో గెలుపొందాలన్నారు. ప్రతిపక్షాలు ఓటమిని వేరొకరకంగా తీసుకువెలతారని.. కావున గెలుపుకు అంతా కలసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.