“భళా తందనాన” ట్రైలర్ విడుదల..

-

బాణం, సోలో వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలతో నటుడిగా పరిచయం అయ్యాడు ‘ శ్రీ విష్ణు’ 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం లో ప్రధాన పాత్ర తో మెప్పించాడు.కాగా 2016లో ” అప్పట్లో ఒకడుండేవాడు” చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు శ్రీ విష్ణు.తాజాగా ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ” భళా తందనాన” యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దంటులూరి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో శ్రీ విష్ణు కు జోడీగా క్యాథరిన్ తెరిసా హీరోయిన్ గా నటించింది.ఇందులో ఆమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర చేసింది.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.కాగా మే 6న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news