BREAKING : ముక్కు ద్వారా ఇచ్చే టీకాకు అనుమతి

-

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. భారత్ బయోటెక్ తయారుచేసిన నాసిక వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డి సి జి ఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే తొలిసారిగా ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా గా ఈ వ్యాక్సిన్ నిలిచింది. 18 సంవత్సరాలు వయసు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు.

భారత్ లో అనుమతి పొందిన తొలి ఇంట్రా నాశల్ కరోనా టీకా కూడా ఇదే కావడం గమనార్హం. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుక్ మాండవీయ వేదికగా తెలిపారు. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4417 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,66,862 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 52,336 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 23 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,007 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news