రాహుల్ ‘యాత్ర’..ప్రజల్ని ఆకర్షించే హామీలు!

-

దేశంలో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే…వరుసగా రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతూ వస్తుంది. కనీసం 100 సీట్లు కూడా దాటని పరిస్తితి. ఇప్పటికీ కాంగ్రెస్ పరిస్తితి అగమ్యగోచరంగానే ఉంది. పైగా నాయకత్వ లోపం ఉంది..అసలు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనేది క్లారిటీ లేకుండా పోయింది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. అటు అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే పరిస్తితి లేదు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరో వైపు సీనియర్లు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.

అలాగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ లాగేసుకుంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు బీజేపీ బలపడుతుంటే…కాంగ్రెస్ వీక్ అవుతూ వస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో రాహుల్ గాంధీ …కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. భారత్ జోడో యాత్ర పేరిట…సెప్టెంబర్ 7 నుంచి కన్యాకుమారిలో రాహుల్ ప్రస్థానం మొదలు కానుంది. ఇక 8వ తేదీ నుంచి పూర్తి స్థాయి పాదయాత్ర మొదలు కానుంది.

150 రోజులు..3570 కిలోమీటర్లు 12 రాష్ట్రాలు..2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ యాత్ర కాశ్మీర్ చేరనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాహుల్ యాత్ర ఉండనుంది. అలాగే పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర అవ్వడమే కాదు…ప్రజలని ఆకర్షించే హామీలని కూడా రాహుల్ ప్రకటించనున్నారు.

ఇప్పటికే గుజరాత్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని…రూ.3 లక్షల వరకు రైతు రుణమాఫీ, రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, 3 వేల ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, రూ. 3 వేల నిరుద్యోగ భృతి ప్రకటించారు…ఇవే కాదు ఇంకా పలు హామీలు ఇచ్చారు…ఇక ఇవే హామీలని దేశ వ్యాప్తంగా అమలు చేసేలా పాదయాత్రలో హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, రాహుల్ బలమైన నాయకుడుగా నిలబడే దిశగా యాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news