నేడు భారత్ బంద్..కానీ ఈ సేవలకు మినహాయింపు

-

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత్ బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. సామాన్యులకు ఇబ్బంది కలక్కుండా రైతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు బంద్’కు టీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలియజేయగా వైసిపి మాత్రం సంఘీభావం తెలుపుతూ ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా బంద్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కి లేదు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది.

కేవలం విద్యా, వ్యాపార సంస్థలు మాత్రమె బంద్ పాటిస్తోండగా మిగతా బ్యాంకింగ్ లాంటి అన్ని అత్యవసర సర్వీసులు యధావిధిగా కొనసాగనున్నాయి. సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చనీ.. 3 గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతుసంఘాల ప్రతినిథులు తెలిపారు. ఆ సమయంలో కార్యాలయాలు కూడా ముగుస్తాయని వెల్లడించారు. అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌లు, పెళ్లిళ్లు యథావిథిగానే జరుగుతాయని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news