సీనియర్ హీరోలలో ఇప్పటివరకు ఎనర్జీ గా ఉండే హీరో మాత్రం బాలకృష్ణ అని చెప్పవచ్చు… ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా సినిమాలతో బిజీగా ఉంటూ అభిమానులను సంపాదించుకుంటూ.. రాజకీయాలలో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలకృష్ణ గురించి బాలయ్య బాబు తో పని చేసిన వారు ఎవరు చెప్పినా సరే ఆయన ఒక చిన్న పిల్లాడిలా ఉంటాడని చెబుతూ ఉంటారు. బాలకృష్ణ గురించి ఒక యూట్యూబ్ ఛానల్ కి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ఆయన సీనియర్ ఎన్టీఆర్ కు , బాలకృష్ణ కి గల పోలికలు వ్యత్యాసాన్ని కూడా బాగా వివరించారు. ఇక బాలకృష్ణకు సీనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఒక కామన్ క్వాలిటీ ఏమిటంటే ఇద్దరు కూడా అభిమానులకు బాగా దగ్గరగా ఉండడానికి ఇష్ట పడతారని తెలిపారు. సినిమా ఫంక్షన్ వేదిక మధ్య నుండి ఎన్టీఆర్ అభిమానుల మధ్య కూడా వచ్చేవాడిని ఆ సంప్రదాయాన్ని బాలకృష్ణ కూడా కొనసాగించారు అని తెలియజేశారు. కేవలం ఎవరైనా ఇబ్బంది కలిగినప్పుడు రియాక్ట్ అవుతారని వెల్లడించారు. ఇక బాలకృష్ణ పై వచ్చే మీమ్స్, జోక్స్ పై బాలకృష్ణ అసలు పట్టించుకోరని తెలిపారు.
రెమ్యునరేషన్ విషయంలో కూడా బాలయ్య అసలు పట్టించుకోరని నిర్మాతలు కొన్నిసార్లు డబ్బు ఇవ్వలేము అని చెప్పినా కూడా సినిమా పూర్తి అవడానికి సహకరిస్తూ ఉంటారని భరద్వాజ్ తెలియజేశారు. ఇక పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా లో ట్రైన్ ముందు తొడగొట్టే సన్నివేశం లో బాలకృష్ణ వద్దన్నా సరే డైరెక్టర్ వినకుండా అలాంటి సన్నివేశం ఇయ్యాలని పట్టుబడడంతో బాలకృష్ణ చేశారని.. తెలియజేశారు. దీంతో బాలకృష్ణ డైరెక్టర్ కి ఇచ్చే గౌరవం ఇదేనని తెలియజేశారు. బాలకృష్ణ బయట ఒకలాగా లోపల మాట్లాడరని తెలియజేశారు. అందుచేత బాలకృష్ణ అంత గొప్ప నటుడు అయ్యారని తెలియజేశారు ఈయన.