తెలంగాణ సీఎం రేసులో నేను ఉన్నాను – భట్టి

-

కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం రేసులో నేను ఉన్నానంటూ ప్రకటించారు భట్టి. కాంగ్రెస్ పార్టీ తరపున నేను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినేనంటూ వెల్లడించారు భట్టి విక్రమార్క. అధిష్టానం కచ్చితంగా తనవైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క.

అయితే.. భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాగా.. పెద్దపల్లి నియోజకవర్గం లో 35 వ రోజు 15 km మేర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగనుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం నుంచి ప్రారంభం కానున్న భట్టి పాదయాత్ర… కాల్వ శ్రీరాంపూర్ ఇప్పలపల్లి, మల్యాల, గూడెం, గుంపుల గ్రామాల మీదుగా కొనసాగనుంది. ఇక రేపు ఉదయం గుంపుల బ్రిడ్జి మీదుగా హుజురాబాద్ నియోజకవర్గానికి ప్రవేశించనున్న భట్టి పాదయాత్ర.. ఇవాళ ఉదయం 10 గంటలకు కాల్వ శ్రీరాంపూర్ లో కార్నర్ మీటింగ్ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news