ప్రధాని నరేంద్రమోడీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

-

ప్రధాని నరేంద్రమోడీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ తో లేఖ రాశారు. విభజన చట్టం ద్వారా పొందిన హక్కులను ఇవ్వాలి..తెలంగాణ మీద మోడీకి ఎందుకు ఇంత కక్ష….కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏమైంది?అని నిలదీశారు. పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు భట్టి విక్రమార్క.

మీరు అధికారం చేపట్టిన ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అయినా జాతీయో హోదా ఇచ్చారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అయిన పాలమూరు`రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎటిఎం గా మారిందని విమర్శలు చేసే మీరు, మీ కేంద్రమంత్రులు, మీ పార్టీవారు దీనిపైన సిబిఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు? మీకు కేసీఆర్‌కు, బిజెపికి, బీఆర్‌ఎస్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి? అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news