మాది రియలిస్టిక్ బడ్జెట్ : భ‌ట్టి

-

మేము పెట్టిన పీపుల్స్ మార్చ్ బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు సానుకూలంగా స్పందిస్తారని ఆశించాను అని శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు. బడ్జెట్ బాగుంది.. బాగాచేశారు. ప్రజల కోసం మీరు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ బాగా కష్టపడుతోందని అంటారని ఆశించా అని తెలిపారు. మీరు ఇప్పుడే వచ్చారు.. ఇంకా ఐదు సంవత్సరాలు సమయం ఉంది.. మీకు సమయం ఇస్తున్నాం అనే ఆలోచన చేస్తారని అనుకున్నా. కానీ కాంగ్రెస్ మీద దాడి చేయడం తప్ప హరీష్ రావు మాట్లాడిందేమీ లేదు అని తెలిపారు.

బీఆర్ఎస్ పదేళ్లు పాలన చేని అంతిమంగా మీరు చెప్పిన ఒక్క హామీ అమలు చేయలేదు. మేము తక్కువ కాలంలోనే చాలా పథకాలు అమలు చేశాము. మేము రైతన్నల గురించి ఆలోచన చేసి రూ.72,659 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించాం. హైదరాబాద్ నగరాభివ్రుద్ధి , మునిసిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కింద రూ.15,594 కోట్లు ఇచ్చాం. ఎస్సీ సబ్ ప్లాన్ గురించి రూ. 33124 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.1,756 కోట్లు కేటాయించాం. మాది రియలిస్టిక్ బడ్జెట్ అని భ‌ట్టి విక్ర‌మార్క‌ అసెంబ్లీలో స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news