కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయి : భట్టి

-

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగులతో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. కార్మికుల సంక్షేమం కోసమని కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు భట్టి విక్రమార్క. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం.. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మినిమం వేజెస్ బోర్డ్ సమీక్ష చేయకుండా నిర్లక్ష్యము చేస్తున్నదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇలా సమీక్షలు జరపకుండా, కనీస‌ వేతనం అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు.

Only Congress can save Telangana from autocracy: Bhatti Vikramarka

కార్మికులకు సంబంధించిన రూ. 10వేల కోట్ల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి కార్మిక లోకం బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిపిఎల్ కింద ఉన్న 54 లక్షల కుటుంబాలకు.. వంద రోజుల పాటు పని కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉపాధి హామీ చట్టం నిధులను సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. 2023- 24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news