Pawan Kalyan: భవదీయుడు భగత్ సింగ్ క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుండే షూటింగ్ షూరు!

-

Pawan Kalyan: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ఆయ‌న వ‌రుస సినిమాల‌తో బిజీగా అయ్యాడు.ప్ర‌స్తుతం సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో భీమ్లా నాయ‌క్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇంకో వైపు క్రిష్ దర్శకత్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నాడు. త‌గ్గేదేలే అన్న‌ట్లు తాజా ప‌వ‌న్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్ద‌మ‌య్యారు.

Bhavadeeyudu-Bhagat-Singh
Bhavadeeyudu-Bhagat-Singh/భవదీయుడు భగత్ సింగ్

‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా చేయ‌నున్నారు. ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా అంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా ? ఎప్పుడెప్పుడూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నది అని ప‌వ‌న్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెంస్టింగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారని టాక్ వ‌చ్చింది. నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ప్రీ ప్రోడ‌క్ష‌న్ వ‌ర్క్ న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. క‌మర్షియల్ ఎలిమెంట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.

కాగా.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజ హెగ్దే నటిస్తుందా లేదా అనేది కూడా అదే రోజున తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని 2022 చివ‌రలో విడుద‌ల చేసే అవకాశం ఉంది.
హ‌రీష్ శంక‌ర్ , ప‌వ‌న్ కాంబినేషన్‌లో ఈ సినిమా రావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా, సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ ఇది. ఇందులో రానా దగ్గుబాటి ప్రతినాయ‌కుడుగా క‌నిపించ‌నున్నాడు. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ మంచి ఆదరణ పొందింది.

ఇక ఇంకోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాలు చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే ..బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో మెరువ‌నున్న‌దని టాక్‌.

ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news