చాలా మంది ఎసిడిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారం, నిద్ర మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఎసిడిటీని తగ్గించుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎసిడిటీ సమస్య తో బాధ పడుతున్నారా..? అయితే ఖచ్చితంగా ఈ పద్ధతులని ఫాలో అవ్వండి. ఈ పద్ధతులను కనుక మీరు పాటించారంటే కచ్చితంగా ఎసిడిటీ సమస్య నుండి బయట పడవచ్చు. అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ చిట్కాల గురించి చూసేయండి.
అరటి పండు
మీరు మీ రోజును అరటి పండు తో మొదలు పెట్టండి. ఇలా కనుక మీరు మొదలు పెట్టారు అంటే కచ్చితంగా ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
తులసి ఆకులు
ఒక గ్లాసు నీళ్ళలో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు సబ్జా గింజల్ని నానబెట్టి వాటిలో తులసి ఆకులు కూడా వేసుకుని తీసుకుంటే మంచిది. ఒకవేళ కనుక మీకు పీరియడ్స్ కానీ దగ్గు, జలుబు కానీ ఉంటే దీనిని తీసుకోవద్దు.
కొబ్బరినీళ్లు
కొబ్బరి నీళ్లని ఉదయం 11 గంటల సమయానికి తీసుకుంటే ఎసిడిటీ సమస్య నుండి బయట పడవచ్చు.
మరికొన్ని చిట్కాలు
తక్కువ తక్కువగా తీసుకుని ఎక్కువ సార్లు తినండి.
అధికంగా ప్రోటీన్ తీసుకోవద్దు.
మాంసాహారాన్ని తగ్గిస్తే మంచిది.
వారానికి రెండు లేదా మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు మాంసాహారం తీసుకోవద్దు.
వజ్రాసనం వేయడం కూడా ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
అలానే తిన్న తరువాత వంద అడుగులు నడవండి. ఇలా ఈ పద్ధతులని ఫాలో అయితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.