బ్రేకింగ్ : గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్

-

అమరావతి : కాసేపటి క్రితమే.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌.. గన్నవరం ఎయిర్‌ పోర్టు కు చేరుకున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన పవన్‌ కళ్యాణ్‌.. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకన్నారు. ఈ నేపథ్యంలో గన్న వరం ఎయిర్‌ పోర్టు కు భారీ స్థాయిలో జన సేన పార్టీ కార్యకర్తలు.. చేరుకున్నారు. ఇక కాసేపట్లోనే జనసేన కార్యాలయానికి చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్‌.

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ర్యాలీగా రానున్నారు పవన్ కళ్యాణ్‌. ప్రభుత్వ విధానాలు.. క్షేత్ర స్థాయి పర్యటనలు.. రోడ్ల మరమ్మత్తులకు శ్రమదానంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే నెల రెండో తేదీన జన సేన శ్రమదానం కార్యక్రమంలో భాగంగా తూ.గో, అనంత జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. డామేజైన రోడ్లకు మరమ్మత్తు చేపట్టేందుకు నిర్వహించే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్‌. బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే అంశం పై కడప జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news