బీహార్ లో కల్తీ మద్యం కలకలం రేపుతోంది. కల్తీ మద్యం కాటుకు రెండు రోజుల్లోనే 24 మంది మృతి చెందారు. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని గోపాల్ గంజ్ గ్రామంలో 18 మంది చనిపోగా….తెల్హువా గ్రామంలో నిన్న కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృతి చెందారు. ఇక తెల్హువా గ్రామంలో కల్తీ మద్యం తాగి మృతి చెందడం ఇది మూడో సారి. ఇక ఈ ఘటనపై సమాచారం అందడంతో మంత్రి జనక్ రామ్ గోపాల్ గంజ్ ప్రాంతానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఈ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే మహ్మద్ పూర్ గ్రామంలోనూ నిన్నటి నుండి పలువురు అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నారు. అయితే వారి పోస్ట్ మార్టం రిపోర్టులు వచ్చేవరకూ మృతికి గల కారణాలు చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై మూడు బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి.