దేశంలో ప్రముఖ నగరాల్లో పెట్రోల్ రేట్లు ఎంతో తెలుసా…?

-

కేంద్రం దీపావళి కానుకగా పెట్రోల్ డిజిల్ రేట్లను తగ్గించింది. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వాారా పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై రూ. 5, డిజిల్ పై రూ. 10 లను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్యడిపై ఎంతో కొంత చమురు భారం తగ్గింది. ఇవే కాకుండా పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా పెట్రోల్ పై పన్నుల భారాన్ని తగ్గించడంతో పెట్రోల్, డిజిల్ రేట్లు మరింత తగ్గాయి. నిన్నటి నుంచి తగ్గిన పెట్రోల్ రేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డిజిల్ రేట్లు ఏవిధంగా ఉన్నాయో చూాద్దాం..

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు:

ముంబై పెట్రోలు – లీటరుకు రూ.109.98,  డీజిల్ – లీటరుకు రూ.94.14,

ఢిల్లీ పెట్రోలు – లీటరుకు రూ.103.97,  డీజిల్ – లీటరుకు రూ.86.67

చెన్నై పెట్రోలు – లీటరుకు రూ.101.40,డీజిల్ – లీటరుకు రూ.91.43

కోల్‌కతా పెట్రోలు – లీటరుకు రూ.104.67,  డీజిల్ – లీటరుకు రూ.89.79

భోపాల్ పెట్రోలు – లీటరుకు రూ.107.23,  డీజిల్ – లీటరుకు రూ.90.87

హైదరాబాద్ పెట్రోలు – లీటరు రూ.108.20,  డీజిల్ – లీటరుకు రూ.94.62

బెంగళూరు పెట్రోలు – లీటరు రూ.100.58,  డీజిల్ – లీటరుకు రూ.85.01

చండీగఢ్ పెట్రోలు – లీటరుకు రూ.100.12,  డీజిల్ – లీటరుకు రూ.86.46

గౌహతి పెట్రోలు – లీటరు రూ.94.58,  డీజిల్ – లీటరుకు రూ.81.29

లక్నో పెట్రోలు – లీటరు రూ.95.28,  డీజిల్ – లీటరుకు రూ.86.80

గాంధీనగర్ పెట్రోలు – లీటరు రూ.95.35,  డీజిల్ – లీటరుకు రూ.89.33

తిరువనంతపురం పెట్రోలు – లీటరుకు రూ.106.36,  డీజిల్ – లీటరుకు రూ.93.47

Read more RELATED
Recommended to you

Latest news