పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజాగా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే, చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నడుస్తోంది.మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఇక భీమ్లా నాయక్ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అలాగే పోస్టర్లతో సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్ లో ఉంది. ఇలాంటి తరుణంలో భీమానాయక్ ఇవాళ విడుదలయ్యారు.
కథ :
మిలిటరీ నుంచి రిటైర్ అయిన డ్యానీ {హీరో రానా } తనకు తిరులేని విధంగా ప్రవరిస్తూ ఉంటాడు. అదే ఊరికి సబ్ ఇన్ స్పెక్టర్ గా వచ్చిన బీమ్లా నాయక్ {హీరో పవన్ కళ్యాన్} తో డ్యానీకి చిక్కులు మొదలు అవుతాయి. ఓ కేసు విషయంలో డ్యానీని భీమ్లా నాయక్ జైలుకు కూడా పంపుతాడు. తాను బెయిల్ పై వచ్చాక నీ అంతు చూస్తా అన్నట్లుగా డ్యానీ., నాయక్ కు వార్నింగ్ ఇస్తాడు. వారిద్దరి మధ్య వైరం నెలకొంటుంది. డ్యానీ తండ్రి అతని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. అలాగే భీమ్లా భార్య సుగుణ కూడా భర్తను ఏ మాత్రం తగ్గొద్దంటూ కోపాన్ని నూరి పోస్తుంది. తరువాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చి వేయడం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయడం ఇలా సినిమాలో చాలా సంఘటనలు జరుగుతాయి. చివరకు భీమ్లా, డ్యానీ ఇద్దరూ ఒకరికిపై ఒకరు దాడికి కూడా దిగుతారు. ఒకరినొకరు చితకొట్టేసుకుంటారు. భీమ్లా చేతిలో డ్యానీ చావడం ఖాయమని తేలుతుందిద. అదే సమయంలో.. డ్యానీ భార్య వచ్చి భీమ్లాను వేడుకుంటుంది. ఒకప్పుడు ఆమె చిన్న తనంలో భీమ్లా కాపాడి ఉంటాడు. అందువల్ల ఈ సారి కూడా ఆమె కోసం భీమ్లా, డ్యానీని వదిలేస్తాడు. ఆ పై భీమ్లా వేరే ఊరికి బదిలీ అవుతాడు. ఓ సంవత్సరం తరువాత భీమ్లా, డ్యానీ కలుసుకుంటారు. ఇద్దరూ కరచలనం చేసుకోవడంతో కథకు శుభం కార్డు పడుతుంది.
క్యారక్టర్లు, నటన తీరు :
భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ పాత్ర చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక పవర్ స్టార్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భీమ్లా నాయక్ ప్రధాన పాత్రల మధ్య వివాదం దర్శకుడు చాలా చక్కగా చూపించేశారు. భీమ్లా నాయక్ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. భీమ్లా నాయక్ లో నటి నిత్యామీనన్ చాలా బాగా నటించగా.. పవన్ అలాగే నిత్యల మధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉంది. డేనియల్ శేఖర్ పాత్రలో రానా స్క్రీన్ స్పేస్ మొత్తాన్ని ఆక్రమించేశాడని చెప్పాలి. పవన్ కొద్దిపాటి నటన డేనియల్‌ని మరింత ఎలివేట్ చేయడానికి సహాయపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ను మించి రానా నటిస్తున్నాడు. కేజీఎఫ్ విలన్, అఖండ విలన్ … సునీల్, సప్తగిరి, హైపర్ ఆది & టన్నుల కొద్దీ పాత్రలను తెరపై ప్రదర్శించిన భీమ్లా నాయక్ పాటలో అకస్మాత్తుగా కనిపించడం విశేషం.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రూపురేఖలు, హెయిర్ స్టైల్ బాలు సినిమా లోలాగా కనిపిస్తున్నాయి.
మైనస్ పాయింట్స్:
– ఫస్టాఫ్ సాగదీత, కాస్త బోరింగ్ అనిపిస్తుంది
– `అంత ఇష్టమేందయ్యా…` పాట సినిమాలో కనిపించక పోవడం
– రానాను తొక్కెసి.. పవన్ కళ్యాణ్ ను లేపారు
ప్లస్ పాయింట్స్:
– పవన్ కళ్యాణ్ , రానా యాక్టింగ్
– నిత్య మీనన్ యాక్టివ్ సినిమా
– ఆకట్టుకొనే పతాక సన్నివేశాలు
– సెకండాఫ్ లోని పోరాట సన్నివేశాలు
రేటింగ్ : 3.5/5