మ‌ట్టి ప‌రిమ‌ళాలా అవి.. వావ్ వావ్ ..థాంక్ యూ భీమ్లా నాయ‌కా

-

అనంత సంగీత సాగ‌రాలు కొన్ని మాత్రమే..అనంతం అనుకున్న‌ది అవ‌ధి నిర్ణ‌యించుకుని ఉంటుందా..భీమ్లా నాయ‌క్..అడ‌వి గీతం వినిపిస్తోంది.ఇద్ద‌రు గొప్ప గాయ‌కులు..ఏమ‌ని రాయాలోతెలుసా గాడ్ గిఫ్ట్ ఆర్టిస్ట్స్ అని రాయాలి.ఆ కోవ‌లో..ఆ తోవ‌లో.. అమ‌రుల గానం చేయాలి..తెలంగాణ ఉనికిని స్థిరం చేస్తూ..కొత్త పాట తీరం ఎలా ఉందో చెప్పాలి. ఒక్క సాకీనే పాడారు పద్మ‌శ్రీ మొగుల‌య్యా..అందాక వారెవ్వ‌రు..వారి ఉనికి ఏంటి తెలియ‌దు? తెలంగాణ ఐటీ శాఖ మంత్రి చూసి పొంగి పోతున్నారు.ఓ సంద‌ర్భంలో భావోద్వేగం చెందారు.

ప‌వ‌న్ ఎంతో మంది క‌ళాకారుల‌ను ముఖ్యంగా తెలంగాణ క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించారు.ఇలా చెప్ప‌డం త‌ప్పు.ఎంతో మందికి జీవితం ఇచ్చారు.దుర్గ‌వ్వ పాడుతుంటే పొంగిపోతాడు.వెంట‌నే త‌న సినిమా భీమ్లా నాయ‌క్ కు పాడించారు.నా పేరు త‌ప్ప ఏమీ మాట్లాడ‌లేను సారూ అని ఆమె అంటుంటే కేటీఆర్ భావోద్వేగం చెందారు.అభిమానులు జేజేలు ప‌లికారు.ఇది క‌దా కావాలి. క‌ళ‌కు ప్రాంతం ఏంటి స‌ర్..అది విశ్వ‌వ్యాప్తం ప‌రివ్యాప్త గుణకం మ‌న‌లో ఉంచి వెళ్లే గొప్ప ల‌క్ష‌ణం స్వ‌రానికే సాధ్యం.ఇద్ద‌రు క‌ళాకారులు. ఎక్క‌డో ఉంటారు.

ఒక‌రు నాగ‌ర్ క‌ర్నూలు దారుల్లో మ‌రొక‌రు మంచిర్యాల దారుల్లో..మంచి గంధం వోలె ఉంటారు.. మంచి పాట పోలి ఉంటారు. మ‌ల్ల‌న్న సాగ‌ర తీరాన ఉంటారు కాళేశ్వ‌రం జ‌లాల చెంత జ‌ల‌ధి అయి ఉంటారు. జ‌ల‌ధి అంటే స‌ముద్రం..ఉద‌ధి అన్నా సముద్ర‌మే..అక్కడ పాట సంద్ర స‌మానం. అలాంటి చోటు కాళేశ్వ‌రం ప్రాజెక్టు నీళ్ల గ‌తి ప్ర‌గ‌తి అన్నీ పాట రూపంలో రాయించారు మంత్రి త‌ల‌సాని అంటూ పొంగిపోయారు లిరిసిస్ట్ కాస‌ర్ల శ్యామ్.. వీళ్లంద‌రికీ వెరీ థాంక్స్.. చిన్న మాట..కాల గ‌తి శ‌బ్ద గ‌తి ఒక‌టి అంతర్లీనం అయి ఉంటుంది.ఇలాంటి శ‌బ్ద‌గ‌తులు ఇరు ప్రాంతాల జీవ‌న విధానాల‌ను స‌ఖ్య‌త‌నూ పెంపొందిస్తాయి. జేజేలు అని త‌ల‌సాని,జేజేలు అని ప‌వ‌న్, జేజేలు అని కేటీఆర్ వీరికి చెప్పి పంపారు.సెబ్బాస్ రా భీమ్లా నాయ‌కా!

– ర‌త్నకిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి

Read more RELATED
Recommended to you

Latest news