BHEEMLA NAYAK : “భీమ్లా నాయక్” నుంచి బిగ్ అప్డేట్..పవన్, రానా మాస్ పోస్టర్ రిలీజ్

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజాగా భీమ్లా నాయక్‌. యంగ్‌ డైరెక్టర్‌ సాగర్‌ కే, చంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ స్టార్ పవన్కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే సంయుక్త మీనన్ హీరో రానా సరసన నడుస్తోంది.మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్.

ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి వచ్చిన.. పోస్టర్లు, టీచర్లు మరియు పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 25 వ తేదీన బీమ్లా నాయక్ సినిమా విడుదల కానుంది.

ఇది ఇలా ఉండగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… భీమ్లా నాయక్‌ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి హీరో పవన్‌ కళ్యాణ్‌, రానా పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ చాలా సీరియస్‌ గా కనిపిస్తుండగా.. సిగరేట్‌ తాగుతూ… రానా కనిపించాడు. మొత్తానికి ఈ సోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news