సెంటిమెంట్ పాలిటిక్స్: ఈ సారి కేసీఆర్‌కు కష్టమే!

అసలు తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టిందే సెంటిమెంట్ మీద అని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమం అనే సెంటిమెంట్ పునాదులు మీద కేసీఆర్ టీఆర్ఎస్‌ని పెట్టి విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాగే కేసీఆర్ తొలిసారి అధికారంలోకి రావడానికి ఈ సెంటిమెంట్ కారణం. కేసీఆర్‌ని తెలంగాణ సాధించిన నేతగా  జనం భావించారు. అందుకే 2014 ఎన్నికల్లో పట్టం కట్టారు. అలాగే అదే సెంటిమెంట్‌తో 2018 ఎన్నికల్లో కూడా కేసీఆర్ అధికారంలోకి వచ్చారు.

kcr
kcr

అయితే తనకు అవసరమైనప్పుడు సెంటిమెంట్‌ని రగిలించి రాజకీయంగా లబ్ది పొందడంలో కేసీఆర్‌ని మించిన వారు లేరనే చెప్పొచ్చు. ఆయన సమయాన్ని బట్టి సెంటిమెంట్ రాజకీయాలని ప్రవేశ పెడతారు. ఇక మరొకసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ అలాంటి రాజకీయాలే చేయొచ్చనే ప్రచారం మొదలైంది. ఇక్కడ కేసీఆర్ మరొక సెంటిమెంట్‌ని కూడా తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లోనే రెండు రకాలుగా కేసీఆర్ లబ్ది పొందారు.

అది ఎలాగంటే ప్రతిపక్షాలు అన్నీ కేసీఆర్‌పై ఎటాక్ చేయడం టీఆర్ఎస్‌కు బాగా కలిసొచ్చింది. పైగా ఏపీలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు. పైగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చూశారు. మిగిలిన ప్రతిపక్షాలు కూడా కలిసిపోయాయి. దీంతో ప్రతిపక్షాలు అన్నీ కలిసి కేసీఆర్‌ని అణిచివేయడానికి చూస్తున్నాయని ప్రచారం చేసుకున్నారు. అలాగే తెలంగాణలో మళ్ళీ ఆంధ్రా నేతల పెత్తనం పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇది కేసీఆర్‌కు బాగా అడ్వాంటేజ్ అయింది. అందుకే మళ్ళీ కేసీఆర్ విజయం సాధించారు.

అయితే ఈ సారి కూడా ప్రతిపక్షాలు, కేసీఆర్ ప్రభుత్వంపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలే కాకుండా వైఎస్సార్టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు కేసీఆర్‌కు యాంటీగా వెళుతున్నాయి. దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. కానీ ఈ సారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు..కాబట్టి ఈ సారి కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదనే చెప్పాలి.