భీమ్లా నాయక్ డైరెక్టర్ కు సినిమా సెట్టయిందా.?

-

సినిమా పరిశ్రమలో పని చేసే వారికి టాలెంట్ తో పాటు, ముందు చూపు, అదృష్టం కూడా వుండాలి.  ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే ఇంకో సినిమా సెట్ చేసుకొని రెడీ గా వుండాలి. లేకుంటే ఇంకో సినిమా చేయటానికి చాలా గ్యాప్ వస్తుంది. ఆ డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా  వెంటనే మరో అవకాశం తెచ్చుకోవాలి 

అందుకే మన స్టార్ హీరోలు, డైరెక్టర్ లు వరసగా సినిమాలు ఒప్పుకుంటూ గ్యాప్ లేకుండా చూసుకుంటారు.కాని ప్రస్తుతం టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా వుంది. ఆ దర్శకుడే పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ సినిమాల మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చంద్ర. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించింది.

సినిమా విడుదలై ఏడాది అవుతున్నా మరో హీరో ఈ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే కామెంట్ లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సాగర్ చంద్రకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ చంద్ర దర్శకత్వం ఒక సినిమా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news