Breaking : నారా లోకేష్ ‘యువగళం’ యాత్ర ప్రారంభం

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైంది. యాత్రకు ముందు కుప్పంలోని వరదరాజ స్వామి ఆలయంలో లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం నుంచి లోకేశ్ వెంట హిందూపురం MLA బాలకృష్ణ, భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో నడిచారు. 400 రోజుల పాటు 4,000KM మేర శ్రీకాకుళం వరకు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే యువగళం సభలో లోకేశ్ పాల్గొంటారు. అనంతరం కుప్పంలో మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగే యువగళం సభలో పాల్గొననున్నారు.

సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారు. తొలి రోజు మొత్తం 8.5 కిలోమీటర్ల దూరం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగనుంది. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ…కార్యకర్తలను పలకరిస్తూ…వివిధ వర్గాల నుంచి వినతులు స్వీకరిస్తూ పాదయాత్ర సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news