భీమ్లా నాయ‌క్ నైజం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ?

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిర‌గి సినిమాలు ప్రారంభించిన త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నాడు. ఇప్ప‌టి కే ఆయ‌న వ‌కీల్ సాబ్ సినిమా ఒక‌టి విడుద‌ల అయి.. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అలాగే మ‌రొక సినిమా భీమ్లా నాయ‌క్ ఇప్ప‌టి కే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ద‌గ్గుపాటి రానా కూడా న‌టిస్తున్నాడు. ఈ సినిమా కు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్ రాస్తున్నాడు.

అయితే ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా రావ‌డం తో ఈ సినిమా ను కాస్త వాయిదా వేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఎది ఏమైన వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల‌లో నే భీమ్లా నాయ‌క్ సినిమా ను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కు సంబంధించి నైజం హ‌క్కుల‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజ్ సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. దీని కోసం దిల్ రాజ్ రూ. 40 కోట్లు ఖ‌ర్చు చేశాడ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news