హెల్త్ యూనివ‌ర్సిటీ నిధుల పై ప్ర‌భుత్వానికి ఆత్రం ఎందుకు – ప‌వ‌న్

-

హెల్త్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద ఉన్న నిధుల‌ను తీసుకోవాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఎందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. హెల్త్ యూనివ‌ర్సిటీ ద‌గ్గర ఉన్న నిధులు మ‌ళ్లించి యూనివ‌ర్సిటీల‌ను నీరుగార్చేలా ప్ర‌భుత్వం చేస్తుంద‌ని ప‌వ‌న్ ఆరోపించారు.హెల్త్ యూనివర్సిటీ దగ్గర రూ 450 కోట్ల నిధులు ఉన్నాయ‌ని అన్నారు. అందులో తెలంగాణా వాటా రూ.170 కోట్లు ఉంటాయ‌ని తెలిపారు. కాగ మిగిలిన వాటి నుంచి ప్రభుత్వం రూ.250 కోట్లు తీసేసుకొంటే మిగిలేది రూ.30 కోట్లు మాత్రమే న‌ని ప‌వ‌న్ అన్నారు.

యూనివర్సిటీకి రూ.30 కోట్లు మిగిల్చి ఏం సాధిస్తారని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. విశ్వ విద్యాలయాలు మెరుగ్గా స‌రిదిద్దాల్సింది పోయి.. ఉన్న నిధులను మళ్లించుకోవడం దురదృష్టకరం అని అన్నారు. కేవ‌లం రూ.250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకింత ఆత్రపడుతోందని అన్నారు. ఈ డ‌బ్బును ఎస్ఎఫ్ఎస్సి లో డిపాజిట్ చేసినా తిరిగి ప్రభుత్వం చెల్లించగలదా అని సందేహం వ్య‌క్తం చేశారు. నిధుల‌ను మ‌ళ్లిస్తే జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news