భీమ్లా నాయక్ రికార్డ్.. 100 మిలియన్ క్లబ్ లో టైటిల్ సాంగ్..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న భీమ్లానాయక్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి లీడ్ రోల్ పోషిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్ సాధించి అయ్యప్పనుమ్ కోషియం మూవీకి రీమేక్ గా భీమ్లా నాయక్ వస్తోంది. వరిజిన్ లో బిజూ మీనన్, ప్రుథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలను పవన్ కళ్యాన్, రానా పోషిస్తున్నారు. దీంతో తెలుగులో కూడా విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. తెలుగులో పవన్ కళ్యాన్, రానాలు పోటీపోటీగా కనిపించనున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నారు. మరోవైపు థమన్ మ్యూజిక్ ఆల్ రెడీ హిట్ అయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఇప్పుడు భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లోొ 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దీన్ని బట్టి చూస్తే పవన్ మాస్ ఇమేజ్ ఎంటో తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్వట్టర్ ద్వారా వెల్లడించింది. రామజోగయ్య శాస్త్రి పవన్ ఇమేజ్ ను ద్రుష్టిలో పెట్టుకుని సాంగ్ రాశారు. జనవరి 12 న సంక్రాంతి కానుగా భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడులయిన తర్వాత మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. .

 

 

Read more RELATED
Recommended to you

Latest news