సికింద్రాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనలో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను సొంతరాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చీఫ్ పెక్రటరీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ రోజు ఉాదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగిందని.. మొత్తం 12 మంది కార్మికుల్లో ఒకరు సురక్షితంగా బయటపడగా… 11 మంది మృతి చెందారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ వెల్లడించారు. టింబర్, స్క్రాప్ గోడౌన్ లో షార్ట్ సర్య్కూట్ కారణం అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. కర్రతో పాటు మంటలు అంటుకునే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలుగా తెలుస్తోంది.