BholaaShankar : “భోళా శంకర్” నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్

-

ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించాడు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. అయితే.. ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది. అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది.

బోలా శంకర్ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. మహాశివరాత్రి కానుకగా బోలా శంకర్ మూవీ నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. శివరాత్రి రోజున ఉదయం 9.05 గంటలకు ఈ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇక ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news