బోయినపల్లి కేసులో సంచలనం..సినిమా సీన్స్ చూసి కిడ్నాప్ ?

బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలు చూసి అఖిల ప్రియ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ చబ్బీస్ అనే సినిమాని చూపెట్టిన భార్గవ్ సోదరుడు చంద్రహాస్, ఐటి అధికారులు గా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా కిడ్నాపర్ లకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్ లో కిడ్నాప్ పై శిక్షణ చంద్రహాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ విషయాలన్నీ స్వయంగా అఖిల ప్రియ ఒప్పుకుందని అంటున్నారు. సినిమా గురించి, చంద్రహాస్ గురించి అఖిలప్రియ వెల్లడించిందని అంటున్నారు. అఖిల ప్రియ ఆదేశాలకనుగుణంగానే అక్షయ్ కుమార్ సినిమా చూపెట్టి భార్గవ్,  చంద్రహాస్ లు కిడ్నాప్ చేయించినట్టు గుర్తించారు. ఐటి అధికారుల డ్రెస్సులు, ఐడి కార్డ్ లను కూడా చంద్రహాస్ రెడీ చేశాడు. అలానే శ్రీ నగర్ కాలనీలోని  ఒక సినిమా కంపెనీ నుంచి ఐటి అధికారుల డ్రెస్ లను సైతం అద్దెకు తీసుకున్న కిడ్నాపర్లు వాటితోనే పనికానిచ్చారు. ఇక భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడనే విషయం పోలీసులు గాలిస్తున్నారు.