మీ భవిష్యత్తు తగలడిపోతుందని తెలిపే సంకేతాలు.. మీలో ఉన్నాయేమో వెంటనే చెక్ చేసుకోండి.

ప్రతీ ఒక్కరూ బతికేది భవిష్యత్తు కోసమే. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియనప్పటికీ, బాగుండాలన్న ఉద్దేశ్యంతో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఐతే మనం చేసే పనుల్లో చాలా పనులు మన భవిష్యత్తుని అంధకారంలోకి లాగేవి ఉంటాయి. అవేంటో గుర్తించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది. భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేసే వర్తమానంలోని పనులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎక్కువ ఆలోచించడం

చిన్న విషయాలని ఎక్కువ ఆలోచించడం మంచిది కాదు. గతంలో చాలా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ గతం జరిగిపోయింది కాబట్టి, ఎంత ఆలోచించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది తెలిసి కూడా ఆలోచించడం అనవసరం.

కావాల్సిన దానికంటే మరీ ఎక్కువగా సోషల్ మీడియాని వాడటం. ఏదైనా అతిగా వాడడం మానుకోవాలి. మనకి తెలియకుండానే మన సమయాన్ని లాగేసుకునే సోషల్ మీడియా వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మీ ఎమోషన్స్ ని మేనేజ్ చేయాలని ప్రయత్నించకండి. ఆ మేనేజింగ్ లో ఏదైనా పొరపాటు ఉంటే ఇబ్బంది పడేది మీరే.

ఫేక్ అకౌంట్లు సృష్టించుకుని ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టడం అపేయండి. దానివల్ల తాత్కాలిక ఉపశమనం తప్ప ఎలాంటి ఫలితం ఉండదు.

నీకు సంబంధం లేని వ్యక్తి నుండి అనవసర అంచనాలు పెట్టుకోవద్దు. ఇంకా చెప్పాలంటే, ఎవ్వరి నుండైనా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయవద్దు.

ఎప్పుడూ యెస్ అని చెప్పకండి. మీకు నచ్చనిది ఉన్నట్లయితే నో చెప్పడం అలవాటు చేసుకోండి.

అవసరం ఉన్నా కూడా మారకపోవడం కరెక్ట్ కాదు. సిగరెట్, మందు వంటివి మానుకుంటే మంచిది. నియంత్రణలో ఉందామని ట్రై చేస్తే అంత తేలిక కాదు.

ఇతరులతో పోల్చుకోవడం మానుకోండి. మీరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా అలా పోల్చకోవద్దు. మిమ్మల్ని ఎవరైనా అలా పోల్చినా అక్కడ నుండి దూరం వచ్చేయండి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి.