రీ రిలీజ్ లో హ్యాట్రిక్ కొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

-

టాలీవుడ్ లో ఇప్పుడంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రీ రిలీజ్ ట్రెండ్ మాత్రం ఓ హీరోయిన్ కు బాగా అచ్చొచ్చింది. ఇప్పటి వరకు ఆమె నటించిన రెండు సినిమాలు థియేటర్ లో రీ రిలీజ్ అయి సూపర్ కలెక్షన్లు సాధించాయి. ప్రస్తుతం మరో సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే.. ఇంకెవరు భూమికా చావ్లా.

రీ రిలీజ్ ట్రెండ్ లో భూమిక నటించిన మూడు సినిమాలు విడుదలై బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేశాయి. ఆమె నటించిన ఒక్కడు, ఖుషి ఇప్పటికే థియేటర్లో మళ్లీ సందడి చేయగా.. తాజాగా సింహాద్రి సినిమా మరోసారి థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

2003లో రిలీజ్ అయిన సింహాద్రిలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించాడు. దీనికి పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అంకిత మరో హీరోయిన్. నాజర్ ప్రధాన పాత్రలో నటించారు.

ఈ సినిమాలో సింగమలై, సింహాద్రి పాత్రల్లో ఎన్టీఆర్ యాక్టింగ్ అదుర్స్. ఇక ఈ మూవీలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ వాడిన ఆయుధం గురించి.  రాజమౌళి సినిమాల్లో ఆయుధాల గురించి తెలిసిందేగా. అప్పట్లో ఈ ఆయుధం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రీ రిలీజ్ ట్రెండులో విడుదలైన అన్ని సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషి సినిమా అత్యధిక కలెక్షన్లు అందుకుంది. ఏకంగా రూ.4.50 కోట్లు వసూల్ చేసి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు సింహాద్రి కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ఇండస్ట్రీ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news