ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అంతా ఇప్పుడు కరోనా వైరస్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఈ వైరస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు మందు వస్తుంది ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కనిపెడతారు అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే కరోనా వైరస్ వల్ల చాలామంది పేదవాళ్ళు, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారి ఇంటికి పరిమితం కావడంతో వాళ్ల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి.ఇటువంటి తరుణంలో చాలా మంది ప్రముఖులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు భువనేశ్వరి మేడం ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటూ కొత్త చర్చకు తెరలేపారు. అప్పట్లో అమరావతిలో రైతుల కోసం బంగారు గాజులు ఇచ్చిన భువనేశ్వరి గారు…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో కరోనా వైరస్ వల్ల చాలామంది జీవితాలు ప్రమాదకరమైన స్థితిలో కి వెళ్లిపోవడంతో…ఈ టైంలో నారా భువనేశ్వరి మేడం ఎంత ప్రకటిస్తారో అంటూ అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
మరోపక్క అసలు ఈ టైంలో ఏం చేస్తున్నారు?, అప్పట్లో అయితే ధర్నా చేస్తున్న రైతుల దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపారు. మరీ ఇంత దారుణమైన అతి క్లిష్టమైన సమయంలో, రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే అసలు భువనేశ్వరి మేడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? మరి ఎక్కడైనా ఉన్నారా? అంటూ తెగ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.