అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన రక్షణ కార్యదర్శిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో మధ్యప్రాచ్యంలో యుఎస్ బలగాలను పర్యవేక్షించిన రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్ ను ఎన్నుకున్నారు. ఈ నిర్ణయం అత్యంత గోప్యంగా బిడెన్ ఉంచారని, ఆ తర్వాత ఒక వ్యక్తి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. నల్ల జాతీయుడుకి బిడెన్ ఈ బాధ్యతలు అప్పగించారు.
2016 లో పదవీ విరమణ చేసిన ఆస్టిన్ ఆ తర్వాత రాజకీయాలకు దగ్గరగా ఉన్నారు. ఏడేళ్ళ సర్వీస్ ఉండగానే ఆయన తప్పుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిటైర్డ్ మెరైన్ జనరల్ జేమ్స్ మాటిస్ ను తన మొదటి రక్షణ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఒబామా హయాంలో యుఎస్ సెంట్రల్ కమాండ్ కు నాయకత్వం వహించిన ఆస్టిన్ పలు కీలక పాత్రలు పోషించారని, ఆయుధాల తయారిదారు రేథియాన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ తో సహా పలు కంపెనీల బోర్డులో ఆయన సేవలు అందించారు.