ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆయనే.. ఫిక్స్ !

-

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ రోజు దగ్గరకు రానే వచ్చింది. బిగ్‌బాస్ షో 10వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నామినేషన్లో ఉన్న వారిలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నామినేషన్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదో ఒక విధంగా క్రేజ్ అందుకున్న వారే.

వాళ్ళు బలంగా పోరాడుతున్నారు కూడా. అయితే ప్రతి వారం లానే ఈ వారం కూడా వచ్చిన లీక్ లను బట్టి ఈ వారం బయటకు వచ్చింది మెహబూబ్ అని అంటున్నారు. నిజానికి ఈ వారం నామినేషన్స్ లో అరియానా, మోనాల్, అభిజిత్, హారిక, సోహైల్, మెహబూబ్ లు ఉన్నారు. వీరిలో మెహబూబ్ కి బయట బెర్ట్ కన్ఫాం కావడంతో ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న అరియానా, మోనాల్, అభిజిత్, హారిక, సోహైల్ సేఫ్ అయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news