క్రేజీ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియాకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి గుర్తింపు వున్న విషయం తెలిసిందే. `బాహుబలి` మూవీతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది. స్టార్ హీరోయిన్ గా తెలుగులో క్రేజ్‌ని సొంతం చేసుకున్న తమన్నా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లవుతున్నా ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
మంచు మనోజ్ నటించిన `శ్రీ` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని దక్కించుకున్న తమన్నా ఇప్పటికీ అదే గ్లామర్‌ని మెయింటేయిన్ చేస్తోంది. ఇటీవల కరోనా మహమ్మారి సోకడంతో కొంత భయాందోళనకు గురైన తమన్నా చికిత్సలో భాగంగా ప్రొటీన్ ఫుడ్ తీసుకుని కొంత బరువు పెరిగిందట. సోషల్ మీడియాలో తను బరువు పెరగడంపై కామెంట్లు వినిపించడంతో మళ్లీ స్లిమ్‌గా మారి షాకిచ్చింది.
శుక్రవారం జరిగిన `ఆహా` ఈవెంట్లో సారీతో తళుక్కున మెరిసింది. లైట్ వాయిలెట్ కలర్ సారీలో అచ్చం బార్బీడాలా మెరిసిపోయింది. ఈ వెంట్లో పాల్గొన్న వాళ్లంతా తమన్నాని చూసి తమన్నానా బార్బిడాలా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం దటీజ్ మహాలక్ష్మి, బోలే చూడియా, గుర్తుందా సీతాకాలం చిత్రాల్లో నటిస్తోంది.