‘బిగ్ బాస్’ ఓటీటీ షో మునుపటి సీజన్స్ కంటే చాలా డిఫరెంట్ గా సాగుతోంది. సీజన్ ఫైవ్ వరకు టెలివిజన్ షోగా కొనసాగిన ఈ రియాలిటీ షో ప్రజెంట్ ‘ఓటీటీ’ 24 బై 7 నాన్ స్టాప్ గా సాగుతోంది. అయితే, ఈ షోలో కంటెస్టెంట్స్ కొందరు డబుల్ మీనింగ్ మాటలు, పెడార్థాలు వచ్చేలా మాట్లాడుతుండటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, షో మాత్రం రోజురోజుకూ వెరీ ఇంట్రెస్టింగ్ అవుతున్నది. కంటెస్టెంట్స్ అందరూ తమ గేమ్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు.
గురువారం నాటి ఎపిసోడ్ లో సంచాలక్ గా వ్యవహరించిన అషురెడ్డిపైన కంటెస్టెంట్స్ తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ ఇచ్చిన కెప్టెన్సీ పోటీదారులు టాస్కులో సత్తా చాటేందుకు పోటీదారులు ప్రయత్నించారు. అషురెడ్డి సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాన్ని మెజారిటీ కంటెస్టెంట్స్ చెప్పారు. ‘గ్రాబ్ ద ఫ్లాగ్’టాస్కుతో పాటు ఇతర వ్యవహారాల్లో అషురెడ్డి పక్షపాతంగా వ్యవహరించిందని కొందరు కంటెస్టెంట్స్ పేర్కొన్నారు.
ఇక కొత్త కెప్టెన్సీ కోసం రాక్ అండ్ రోల్ గేమ్ కొనసాగింది. ఈ ఆటలో కెప్టెన్సీ కోసం పోటీదారులు తమదైన ఎత్తుగడలు వేశారు. చాలా కాలం నుంచి కేప్టెన్సీ కోసం శివ ప్రయత్నిస్తున్నారు. చివరి వరకు వచ్చి అక్కడ గెలుచుకోలేకపోతున్నాడు. కాగా, గురువారం ఎట్టకేలకు తను అనుకున్నది సాధించాడు శివ.
శివ కెప్టెన్ గా గెలిచినందుకు బిందు మాధవి సంతోషం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ చివరి వరకు వచ్చ కెప్టెన్సీ మిస్ చేసుకోగా, అతనిని ఓదార్చింది బిందు మాధవి. అయితే, అషురెడ్డి మాత్రం పోటీదారుగా ఉండి ఓడిపోవడం తట్టుకోలేకపోయి కన్నీటి పర్యంతమైంది. హౌజ్ లో సంచాలక్ గా శివ వ్యవహార శైలి ఉండబోతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.