అమ్మ ఒడి లబ్దిదారులకు జగన్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. కుటుంబ గృహ విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్ల లోపు ఉంటేనే అమ్మ ఒడి డబ్బులు వస్తాయి. అంతకంటే.. ఎక్కువ ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు. నవంబర్ 8 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు విద్యార్థుల హాజరు 75 శాతం లేకపోయినా… అమ్మ ఒడి వర్తించదు.
అలాగే లబ్దిదారులు ఆధార్ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ను ఫోన్ నంబర్ తో లింక్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాగ.. చేస్తేనే.. అమ్మ ఒడి పథకం డబ్బులు వస్తాయని స్పష్టం చేసింది సర్కార్. కాగా.. అమ్మ ఒడి పథకాన్ని ఏపీలోని పేద తల్లి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు సీఎం జగన్ మోహన్‌రెడ్డి. చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారం భించిన సంగతి తెలిసిందే.